నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికాలో స్వాధీనంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులపై గ్రీన్‌ల్యాండ్ స్పందించింది. తాము అమెరికాలో చేరబోమని, డెన్మార్క్ యూనియన్‌లోనే ఉంటామని గ్రీన్‌ల్యాండ్ ప్రధాని జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్ పేర్కొన్నారు. పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని, తమ దేశాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు అమెరికా బెదిరింపులకు దిగుతోందని మండిపడ్డారు. అమెరికానా, డెన్మార్కా ఎంపిక చేసుకోమంటే.. తాము డెన్మార్క్‌నే ఎంపిక చేసుకుంటామని స్పష్టం చేశారు. వాస్తవానికి గ్రీన్‌ల్యాండ్ డెన్మార్క్‌లో భాగమని జెన్స్ ఫ్రెడరిక్ పేర్కొన్నారు. కోపెన్‌హాగన్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. డానిష్ ప్రధాని మెట్ ఫ్రెడరిక్‌సన్ కూడా ఈ సమావేశంలో పాల్గన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్క్ రూబియోలతో డెన్మార్క్, గ్రీన్‌ల్యాండ్ విదేశాంగ మంత్రులు బుధవారం జరగనున్న ఉన్నత స్థాయి చర్చలకు ముందు ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. గ్రీన్‌ల్యాండ్‌పై బెదిరింపులను తగ్గించడం, దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించడం ఈ చర్చల లక్ష్యమని పేర్కొన్నారు.ట్రంప్ బెదిరింపులు
ఆర్థిక ఒత్తిడి లేదా సైన్యాన్ని ప్రయోగించడం ద్వారా గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు ట్రంప్ యత్నిస్తున్న సంగతి తెలిసిందే. జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్ వ్యాఖ్యలపై ట్రంప్ మరింత బెదిరింపులకు దిగారు. తరువాత వారికి పెద్ద సమస్యను సృష్టించగలదని హెచ్చరించారు. అది వాళ్ల సమస్యఅని అన్నారు. వారి సమస్యతో తాను విభేదిస్తున్నానని అన్నారు.



