- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై ఎస్‌ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇటీవల సికింద్రాబాద్‌లో జరిగిన ఓ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి తలసాని చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రవికిరణ్ దేవులపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఆర్ నగర్ పోలీసులు తెలిపారు.
- Advertisement -



