తెలుగు చిత్ర పరిశ్రమలో హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌తో ఎన్నో ఘన విజయాలను అందించిన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తన 43వ సినిమాగా ‘వేదవ్యాస్’ చిత్రాన్ని రూపొం దిస్తున్నారు.
నిర్మాత కె.అచ్చిరెడ్డి సమర్పణలో సాయిప్రగతి ఫిలింస్ బ్యానర్‌పై వ్యాపారవేత్త, పొలిటీషియన్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నిర్మిస్తున్నారు. బుధవారం నిర్మాత కె.అచ్చిరెడ్డి బర్త్‌డేని పురస్కరించుకుని ఆయన పుట్టినరోజు వేడుకలతో పాటు ”వేదవ్యాసు హీరో పిడుగు విశ్వనాథ్‌ను పరిచయం చేశారు. హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో నటుడు సాయికుమార్ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిడుగు సుబ్బారావు మాట్లాడుతూ,’ఎస్వీ కష్ణారెడ్డి, అచ్చిరెడ్డి గొప్ప కాంబినేషన్ మూవీతో మా అబ్బాయి విశ్వనాథ్ హీరోగా పరిచయం కావడం ఎంతో సంతోషంగా ఉంది. నా జీవితంలో ఇంతకంటే హ్యాపీగా ఫీలైన సందర్భం లేదు’ అని అన్నారు. జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ,’ నేను ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలకు పీఆర్‌ఓగా పనిచేశాను. అచ్చిరెడ్డి, కష్ణారెడ్డితో నాకు ఎంతో స్నేహం, అనుబంధం ఉన్నాయి. ఈ కథ కష్ణారెడ్డి నాకు చెప్పారు. ఒక గొప్ప చిత్రాన్ని ఆయన మన ముందుకు తీసుకురాబోతున్నారు’ అని అన్నారు.
హీరో పిడుగు విశ్వనాథ్ మాట్లాడుతూ, ‘ఈ సినిమాలో హీరోగా నటించే అవకాశం కల్పించిన అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డికి కతజ్ఞతలు. వారి సినిమాతో హీరోగా పరిచయం కావడం నా అదష్టంగా భావిస్తున్నా’ అని చెప్పారు.
ప్రొడ్యూసర్ కె. అచ్చిరెడ్డి మాట్లాడుతూ,’మా ఎస్వీ కృష్ణారెడ్డి ఈ సినిమా కోసం ప్రతీ విషయం కొత్తగా ఉండాలని కోరుకున్నారు. కొరియా వెళ్లి ఆడిషన్ చేసి కొరియన్ అమ్మాయి జున్ హ్యున్ జీ ని సెలెక్ట్ చేసుకున్నారు. అలాగే మంగోలియా వెళ్లి విలన్‌ను సెలెక్ట్ చేశారు. ఒక కొత్త హీరో అయితేనే బాగుంటుందని విశ్వనాథ్‌ను తీసుకున్నారు. మూవీలో వీళ్లందరినీ చూశాక కృష్ణారెడ్డి జడ్జిమెంట్ ఎంత కరెక్ట్ అనేది అర్థమైంది. ఈ సినిమాలో సాయికుమార్ వేద నారాయణ అనే ఒక ప్రధానమైన పాత్రలో నటించారు. సాయికి ఈ చిత్రంతో ఎన్నో ప్రశంసలు దక్కుతాయి’ అని తెలిపారు. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ,’విశ్వనాథ్‌ను హీరోగా పరిచయం చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో ఆయన ప్రతి సన్నివేశంలో అద్భుతంగా నటించారు. మంచి ఫైట్స్ చేశారు. నేను షూటింగ్ చేశా కాబట్టి ఈ విషయం చెబుతున్నా. విశ్వనాథ్ హీరోగా మంచి పేరు తెచ్చుకుంటాడు. భారతీయ సంస్కృతి సంప్రదాయల గొప్పదనం చాటేలా రూపొందిస్తున్నాం’అని అన్నారు.
సరికొత్తగా ‘వేదవ్యాస్’
- Advertisement -
- Advertisement -



