జరిమానా విధించిన బిడబ్ల్యూఎఫ్
న్యూఢిల్లీ : ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఓపెన్ బ్మాడ్మింటన్ పోటీల నుంచి ప్రపంచ నంబర్ 3, డెన్మార్క్ ప్లేయర్ ఆండర్స్ ఆంటన్సెన్ వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. ఢిల్లీలో ఉన్న తీవ్రమైన వాయు కాలుష్యం వల్లే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. దీంతో అతనిపై బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బిడబ్ల్యూఎఫ్) 5000 డాలర్ల జరిమానా విధించింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఇండియా ఓపెన్ పోటీలు జరుగుతున్నాయి. ఇక్కడే ఆగస్టులో బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ జరగనున్నాయి. దీంతో ప్రస్తుతం జరుగుతున్న పోటీలను టెస్ట్ ఈవెంట్‌గా ప్రకటించారు. ఇలాంటి పోటీల నుంచి వైదొలుగుతున్నట్లు ఆండర్స్ ఆంటన్సెన్ ప్రకటించడం సంచలనంగా మారింది. దీనికి ముందు డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ మియా బ్లిచ్‌ఫెల్డ్ట్ సైతం పరిశుభ్రత లేదనే కారణంతో మ్యాచ్ నుంచి వైదొలగింది. అయితే ఈ వాదనలను భారత బ్యాడ్మింటన్ సంఘం (బిఎఐ) ఖండించింది. బ్లిచ్‌ఫెల్డ్ట్ వ్యాఖ్యలు పాత కేడీ జాదవ్ స్టేడియంలోని వార్మప్ ప్రాంతాన్ని సూచిస్తున్నాయని బిఎఐ ప్రధాన కార్యదర్శి సంజయ్ మిశ్రా అన్నారు. ప్రస్తుతం పోటీలు జరుగుతోన్న ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలోని బ్యాడ్మింటన్ వేదికను శుభ్రంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
చిన్న చిన్న లోపాలు సహజమే : శ్రీకాంత్
డెన్మార్మ్ ప్లేయర్ల ఆరోపణలపై భారత్‌కు చెందిన ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ స్పందించారు. అంతర్జాతీయ క్రీడల సమయంలో ప్రతి దేశం క్రీడాకారులకు మంచి సౌకర్యాలు కల్పించాలనే అనుకుంటుందని..కానీ కొన్ని సమయాల్లో చిన్న చిన్న సమస్యలు, లోపాలు తలెత్తుతాయని అన్నారు. ఇటువంటివి ఎవరూ కావాలని చేయరని అన్నారు.2016-17లో తాను డెన్మార్క్‌లో మ్యాచ్‌లో పాల్గొన్న సమయంలో అక్కడి విద్యుత్ కోతల వల్ల ఫ్లడ్‌లైట్ వైఫల్యం తలెత్తిందని గుర్తు చేసుకున్నారు. మ్యాచ్ మధ్యలో ఫ్లడ్‌లైట్లు ఆరిపోవడంతో గంట సేపు వేచి ఉండాల్సి వచ్చిందన్నారు. అంతర్జాతీయ క్రీడల్లో భాగంగా ఆటగాళ్లు వివిధ దేశాలకు వెళ్లాల్సి వస్తుందని..ఆ సమయంలో అక్కడి సవాళ్లను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు.
వాయు కాలుష్యం ఆరోపణలతో వైదొలిగిన డెన్మార్క్ ప్లేయర్
- Advertisement -
- Advertisement -



