టాప్ ప్లేస్‌లో విరాట్ కోహ్లీ
దుబాయ్ : టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐసీసీ తాజాగా వన్డే ర్యాంకింగ్స్‌లో నం.1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. దాదాపు నాలుగేళ్ల తర్వాత కోహ్లి ఈ ఘనతను సాధించాడు. విరాట్ చివరిసారిగా జులై 2021లో నం.1 ర్యాంకులో ఉన్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్ తొలి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కారణంగా విరాట్ కోహ్లి టాప్‌లోకి దూసుకెళ్లాడు. ఆ మ్యాచ్‌లో అతడు 91 బంతుల్లో 93 పరుగులు సాధించాడు. వన్డేల్లో పునరాగమనం తర్వాత విరాట్ నిలకడగా రాణిస్తున్న విషయం తెలిసిందే. గత అయిదు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 50 ప్లస్ స్కోర్లు సాధించాడు. ఓవరాల్‌గా 469 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలున్నాయి. ప్రస్తుతం అతడు 785 రేటింగ్ పాయింట్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ మొదటి సారిగా అక్టోబర్ 2013లో నం.1 ర్యాంకుకు చేరుకుని, రికార్డ్ స్థాయిలో 825 రోజుల పాటు కొనసాగిన విషయం తెలిసిందే. కాగా, ఈ ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్‌కు చెందిన డారిల్ మిచెల్ 784 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. మిచెల్ భారత్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో 84 పరుగులు చేశాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ మొదటి స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయాడు. అతడి ఖాతాలో 775 రేటింగ్ పాయింట్లున్నాయి.
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్
- Advertisement -
- Advertisement -



