– నాలుగైదు రాష్ట్రాల నుంచే 70 శాతం సరఫరాలు
– పది రాష్ట్రాల నుంచి 91 శాతం ఎక్స్్పోర్ట్స్
– సింగిల్ డిజిట్ కోసం 20కి పైగా రాష్ట్రాలు పోటీ
న్యూఢిల్లీ : ఇటీవల న్యూజిలాండ్‌తో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. న్యూజిలాండ్‌కు మన దేశం నుంచి జరుగుతున్న ఎగుమతుల కంటే అక్కడి నుంచి చేసుకుంటున్న దిగుమతులే ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ ఒప్పం దంతో భారత వాణిజ్య సమతుల్యతలో గణనీ యమైన పెరుగుదల కన్పిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. వాస్తవానికి బలహీనపడిన మన రూపాయి పనితీరు ఇతర ఆసియా దేశాల కరెన్సీలతో పోలిస్తే దారుణంగా ఉంది. అయినప్పటికీ గణాంకాలను నిశితంగా పరిశీలిస్తే అనేక అసమానతలు బయటపడుతున్నాయి.
ఎగుమతులు ఇలా…
ఎగుమతులు కొన్ని రాష్ట్రాలకే పరిమిత మవుతున్న తీరు సంక్షోభానికి దారితీస్తోంది. ఉదాహరణకు గుజరాత్ నుంచి పెట్రోలియం ఉత్పత్తులు, రసాయనాలు, శుద్ధి చేసిన ఇంధనాల ఎగుమతులు పెరుగుతున్నాయి.
ఇవన్నీ ఆ రాష్ట్రంలోని ఓడరేవుల ద్వారా రవాణా అవుతున్నాయి. ఇక రత్నాలు, ఆభరణాల ఎగుమతుల విషయంలో మహారాష్ట్ర ముందుంది. తమిళనాడు బలమంతా ఆటోమొబైల్స్, ఆటో విడిభాగాలు, యంత్రాలు, ఎలక్ట్రానిక్స్‌పై ఆధారపడి ఉంది. కర్నాటక నుంచి ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ భాగాలు, ఐటీ ఆధారిత ఉత్పత్తులు అధికంగా ఎగుమతి అవుతున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఇటీవలి కాలంలో ఆర్జించిన లాభాలన్నీ మొబైల్ ఫోన్ అసెంబ్లింగ్, లైట్ ఇంజినీరింగ్‌లో కేంద్రీకృతమయ్యాయి. ఇవన్నీ నోయిడాలోనే కేంద్రీకృతమయ్యాయి. ఈ రాష్ట్రాలన్నీ పటిష్టవం తమైన సరఫరా వ్యవస్థలు, పారిశ్రామిక కారిడార్లు, పీఎల్ఐ సంబంధిత పెట్టుబడులు, విదేశీ మూల ధనం కారణంగా ప్రయోజనం పొందుతున్నాయి.
ఆందోళనకరం
హెర్ఫిండాల్-హిర్చ్మాన్ సూచిక ప్రకారం దేశం నుంచి ఎగుమతులు బాగా పెరుగుతున్నాయి. అయితే ఆయా ఉత్పత్తులు కొన్ని ప్రాంతాలలోనే కేంద్రీకృతం కావడం ఆందోళన కలిగించే విషయం. ఇటీవలి కాలంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ఎగుమతులు 45 శాతం పెరిగాయి. అమెరికా, యూఏఈ మార్కెట్ల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. తమిళనాడు వంటి రాష్ట్రాలలో ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తి జోరుగా జరుగుతోంది. దీనికి భిన్నంగా బీహార్ వంటి రాష్ట్రాలు కేవలం వ్యవసాయోత్పత్తుల ఎగు మతులకే పరిమితమవుతున్నాయి. అవి ఆధునిక వాణిజ్య వ్యవస్థలకు దూరంగా ఉంటున్నాయి. ఎగుమతుల గమ్యస్థానాలలో కూడా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 2023-24లో భారత్ ఎగుమతులలో అమెరికా వాటా 17.90 శాతం. యూఏఈ (8.23 శాతం), నెదర్లాండ్స్ (5.16 శాతం) ఆ తర్వాతి స్థానాలలో ఉన్నాయి. మొత్తంగా చూస్తే కోస్తా రాష్ట్రాలే ఎగుమతుల ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందుతున్నాయి. ఎగుమతులకు కేంద్రాలుగా ఉన్న తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తరచుగా 90 శాతం సీడీ రేషియోను దాటేస్తున్నాయి. దీనిని భిన్నంగా బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్‌లో ఈ దామాషా 50 శాతం కంటే తక్కువగానే ఉంది.
పెరుగుతున్న అసమానతలు
దేశం నుంచి జరుగుతున్న ఎగుమతులలో మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్నాటక, ఉత్తరప్రదేశ్…ఈ ఐదు రాష్ట్రాల వాటా సుమారు 70 శాతంగా ఉంది. ఇది ఆందోళన కలిగించే విషయమే. 2017-18, 2020-21 మధ్యకాలంలో భారత్ నుంచి జరిగిన మొత్తం ఎగుమతులలో పది రాష్ట్రాల వాటా దాదాపు 84 శాతం. 2022-25 నాటికి అది 91 శాతానికి చేరుకుంది. అంటే మిగిలిన 20కి పైగా రాష్ట్రాలు ప్రపంచ వాణిజ్యంలో సింగిల్ డిజిట్ వాటా కోసం పోటీ పడుతున్నాయని అర్థమవుతోంది. ఎగుమతులు అత్యధికంగా జరుగుతున్న రాష్ట్రాలలో కూడా అసమానతలు కన్పిస్తున్నాయి. గుజరాత్ వాటా 21.9 శాతం నుంచి 31 శాతానికి పెరిగింది. అదే సమయంలో మహారాష్ట్ర వాటా పడిపోయింది. అంటే కొన్ని ప్రాంతాలే ఎగుమతులకు కేంద్రాలుగా ఉంటున్నాయన్న మాట. అవి తమ పారిశ్రామిక సామర్ధ్యాన్ని రోజురోజుకూ పెంచుకుంటున్నాయి. ఇది యాదృచ్ఛికంగా జరుగుతున్నదేమీ కాదు. రంగాల వారీగా పరిశీలిస్తే ఈ విషయం బోధపడుతుంది.
పెట్టుబడులే కీలకం
ఎగుమతుల విషయంలో రాష్ట్రాల మధ్య అసమానతలు చోటుచేసుకోవడానికి పెట్టుబడులు ప్రధాన కారణం అవు తున్నాయి. ఎగుమతులలో మొదటి ఆరు స్థానాలలో ఉన్న రాష్ట్రాలకు 2019 అక్టోబర్-2025 సెప్టెంబర్ మధ్యకాలంలో 91 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలకూ కలిపి వచ్చిన ఎఫ్‌డీఐలలో మహారాష్ట్ర వాటా 31 శాతం కాగా కర్నాటక 20 శాతం, గుజరాత్ 16 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టు బడులను ఆకర్షించాయి. కేవలం నాలు గైదు రాష్ట్రాల నుంచే ఎగుమతులు ఎక్కు వగా జరుగుతున్నప్పుడు 8-10 శాతం వృద్ధి రేటు సాధించడం సాధ్యం కాదు.
కేంద్రీకృతమవుతున్న ఎగుమతులు
- Advertisement -
- Advertisement -



