Thursday, January 15, 2026
E-PAPER
Homeక్రైమ్ప్రాణం తీసిన పతంగి మాంజా

ప్రాణం తీసిన పతంగి మాంజా

- Advertisement -

బైక్‌పై వెళ్తుండగా మాంజా తగిలి కోసుకుపోయిన మెడ
నవతెలంగాణ-సంగారెడ్డిరూరల్‌

పతంగి మాంజా ఓ వ్యక్తి ప్రాణం తీసింది. గొంతుకు కోసుకుని మృతిచెందాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పరిధిలోని సంగారెడ్డి మండలం ఫసల్‌వాదిలో బుధవారం జరిగింది. సంగారెడ్డి రూరల్‌ ఎస్‌ఐ మధుసూదన్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌ ప్రాంతానికి చెందిన అవదేష్‌ కుమార్‌(38) వరి కోతల సమయంలో పసల్‌వాది గ్రామానికి వచ్చి కొద్దిరోజులుగా ఇక్కడే నివాసం ఉంటున్నాడు. అయితే బుధవారం మధ్యాహ్నం బైక్‌పై పని నిమిత్తం బయటకు వెళ్లి తిరిగి ఫసల్‌వాది వెళుతున్న క్రమంలో పతంగి మాంజా గొంతుకు బలంగా కోసుకుపోయింది. తీవ్రంగా గాయపడి కింద పడిపోయాడు. వెంటనే అతడిని 108 ద్వారా ప్రభుత్వ ఆస్పత్రికి తరలిం చారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుని కుమారుడు భానుప్రతాప్‌ భాస్కర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -