Thursday, January 15, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహైదరాబాద్ లో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత

హైదరాబాద్ లో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: పాతబస్తీలోని పురానాపూల్ ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి రెండు వర్గాల మధ్య స్వల్ప వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాలు పరస్పరం దాడులకు దిగడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో జరిగిన రాళ్ల దాడిలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ఉన్నతాధికారులు భారీగా పోలీసు బలగాలను మోహరించి, బహదూర్ పుర నుండి పురానాపూల్ వెళ్లే ప్రధాన రహదారిని మూసివేశారు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ, పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేసి నిశీతంగా గమనిస్తున్నారు. ఘర్షణకు గల కారణాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -