- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి సమస్యల పరిష్కారానికి జనవరి 30న ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, సీడబ్ల్యూసీ అధికారులతో పాటు ఏపీ, తెలంగాణ ప్రతినిధులు పాల్గొంటారు. పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టులు, రెండు రాష్ట్రాల మధ్య నీటి యాజమాన్య వివాదాలపై చర్చించనున్నారు. KRMB, GRMB ప్రతినిధులు తాజా నివేదికలు సమర్పించనున్నారు.
- Advertisement -



