నవతెలంగాణ-కమ్మర్‌పల్లి: మండల కేంద్రానికి చెందిన చింతకుంట రాజును శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఇటీవల చింతకుంట రాజు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్ఎఫ్) ఆర్మీ జవాన్‌గా ఎంపికవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ.. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ మేరకు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయం వద్ద రాజును శాలువాతో సత్కరించి, అభినందించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి మాట్లాడుతూ.. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్ఎఫ్) ఆర్మీ జవాన్‌గా చింతకుంట రాజు దేశానికి ఉత్తమ సేవలందించడం ద్వారా పేరు ప్రఖ్యాతలు పొందాలని ఆకాంక్షించారు. రాజును ఆదర్శంగా తీసుకొని యువత ఆర్మీలో ఉద్యోగాలు సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో కమ్మర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సల్లూరి గణేష్ గౌడ్, నాయకులు దూలూరి కిషన్ గౌడ్, నిమ్మ రాజేంద్రప్రసాద్, వేములవాడ జగదీశ్వర్, ఉట్నూరు నరేందర్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
BSF జవాన్‌గా చింతకుంట రాజు ఎంపిక.. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



