Saturday, May 24, 2025
Homeజిల్లాలుకొన..సాగుతున్న… ఫార్మర్ ఐడీ.!

కొన..సాగుతున్న… ఫార్మర్ ఐడీ.!

- Advertisement -

రైతు గుర్తింపు నమోదు వెరీ స్లో

మండలంలో అర్హులైన రైతులు 9653

రిజిస్ట్రేషన్ పూర్తియైనవి 306

నవతెలంగాణ మల్హర్ రావు:

ఫార్మర్ ఐడీ (రైతు గుర్తింపు) రిజిస్ట్రేషన్ల నమోదు ప్రక్రియ మండలంలో వెరీ స్లోగా కొనసాగుతున్నది. వ్యవసాయ రంగాన్ని పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ చేయడమే లక్ష్యంగా రూపొందించిన ఫార్మర్ ఐడీ ప్రాజెక్ట్ ఈనెల 5న ప్రారంభమైయింది. ఈ పథకం నిబంధనల ఆధారంగా మండలంలో 9653 మంది రైతులు అర్హులు ఉన్నారు. వీరిలో మే21 నాటికి 306 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో ఇప్పటికే 306 మంది రైతులకు ఫార్మర్ ఐడీ జనరేట్ అయింది.ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో మండలం కాస్త వెనుకబడినట్లుగా తెలుస్తోంది.

కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఫార్మర్ ఐడీపై రైతులకు అవగాహన కల్పించకపోడంతో ఈ ప్రక్రియ స్లోగా సాగుతోంది. కేంద్రం రూపొందించిన పథకాల అమలుకు ఈ ప్రాజెక్ట్ ను రూపొందించారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన. సాయిల్ హెల్త్ కార్డు, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, భారత ఆహార భద్రత మిషన్, రాష్ట్రీయ కృషి వికాస యోజన వంటి పథకాల అమలులో ఈ ఐడీ కార్డు కీలకం కానుంది. కేంద్రం అమలు చేస్తున్న పథకాలను పారదర్శకంగా రైతుల దరి చేర్చడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు.ప్రస్తుతం కొనసాగుతున్న ‘రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో వానాకాలం పంట సాగు అంశాలను వివరించడంతో పాటు ఫార్మర్ ఐడీతో ప్రయోజనాలు, రిజిస్ట్రేషన్ ప్రాముఖ్యతను కూడా వివరిస్తుండగా ప్రక్రియ వేగవంతానికి ఇవి దోహదం చేస్తున్నాయి.

ఫార్మర్ ఐడీ ప్రక్రియలో రైతులకు ఉన్న భూమి వివరాలు సర్వే నంబర్ల వారీగా నమోదవుతాయి.పార్మర్ ఐదిలో అర్హత సాధించిన రైతులకు 11 అంకెలతో కూడిన నెంబర్ జనరేట్ అవుతుంది. భూమి రకం, ఆయా భూముల్లో సాగు చేసే పంటలను కూడా పొందుపరుస్తారు. డిజిటల్ విధానంలో వ్యవసాయ విస్తరణాధికారులు ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. మండలంలో తాడిచెర్ల, పెద్దతూoడ్ల,కొయ్యుర్,రుద్రారం క్లస్టర్లలో ఈ ప్రక్రియ నిరంతరాయంగా సాగుతోంది. రైతు వేదికల్లో నిర్వహించే ఈ ప్రక్రియకు రైతులు తరలివస్తూ ఫార్మర్ ఐడీ కోసం తమ భూములు, పటల సాగు వివరాలు చెబుతూ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకుం టున్నారు. అందుబాటులో లేని కొందరు రైతులు మీ సేవా కేంద్రాల్లోనూ రిజిస్ట్రేషన్లు చేయించుకుం టున్నారు.

శ్రీజ..మండల వ్యవసాయాధికారి

ఫార్మర్ ఐడీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ కార్డు ఆధారంగానే కేంద్ర పథకాలు అందు తాయి. కార్డు లేనివారు ఆ పథకాలకు దూరమయ్యే ప్రమాదం ఉంది. రైతులు తప్పనిసరిగా నిర్దేశిత గడువు లోగా ఏఈఓలను సంప్రదించి భూములు, పంటల సాగు వివరాలను తెలిపి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -