Monday, May 4, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపెండ్లి చేసుకుంటాననుకున్న వ్యక్తి బహ్రెయిన్‌లో మృతి..

పెండ్లి చేసుకుంటాననుకున్న వ్యక్తి బహ్రెయిన్‌లో మృతి..

- Advertisement -

మనస్తాపంతో యువతి ఆత్మహత్య
జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలంలో ఘటన
నవతెలంగాణ – మల్లాపూర్‌

పెండ్లి నిశ్చయమైన వ్యక్తి గల్ఫ్‌ దేశంలో ఆత్మహత్య చేసుకున్నాడు.. దీంతో మనస్తాపం చెందిన యువతి కూడా ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారకర ఘటన ఇది.. జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలంలోని సిరిపూర్‌ గ్రామంలో జరిగిన ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. పోలీసుల వివరాల ప్రకారం.. సిరిపూర్‌ గ్రామానికి చెందిన ఒల్లెపు రంగయ్య, లక్ష్మి దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె ఒల్లెపు శృతి (19) ప్రస్తుతం ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పూర్తిచేసింది. ఏడు నెలల క్రితం ఇదే మండలానికి చెందిన పాతధామ్‌రాజ్‌పల్లి గ్రామానికి చెందిన మక్కల సాయికుమార్‌తో ఆమెకు నిశ్చితార్థం అయ్యింది. తరువాత ఉపాధి కోసం గల్ఫ్‌ దేశమైన బహ్రెయిన్‌కు సాయికుమార్‌ వెళ్లాడు. తిరిగి వచ్చిన తరువాత పెండ్లి తేది నిర్ణయించాలనుకున్నారు. కాని అనూహ్యంగా ఈ నెల 1న అక్కడే సాయికుమార్‌ ఉరేసుకుని ఆత్మహ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -