Saturday, January 17, 2026
E-PAPER
Homeసినిమా'స్పిరిట్‌' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘స్పిరిట్‌’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

- Advertisement -

అగ్ర కథానాయకుడు ప్రభాస్‌, దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘స్పిరిట్‌’. న్యూ ఇయర్‌కి పవర్‌ఫుల్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన మేకర్స్‌ ఇప్పుడు థియేట్రికల్‌ రిలీజ్‌ డేట్‌ని ఖరారు చేశారు. వచ్చే ఏడాది సమ్మర్‌ రేస్‌ను కిక్‌ స్టార్ట్‌ చేస్తూ మార్చి 5, 2027న గ్రాండ్‌గా రిలీజ్‌ చేయబోతున్నారు. సందీప్‌ వంగా మార్క్‌ ఇన్‌టెన్స్‌, యాక్షన్‌, ఎమోషన్స్‌, రా పవర్‌తో ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ అద్భుతమైన సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ని అందించబోతోంది. త్రిప్తి దిమ్రీ హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రకాష్‌ రాజ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. భద్రకాళి పిక్చర్స్‌, టి-సిరీస్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా భారీ స్థాయిలో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ దశలో ఉంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడతో పాటు చైనీస్‌, జపనీస్‌, కొరియన్‌ మొత్తం 8 భాషల్లో యూనివర్సల్‌గా ఈ సినిమా రిలీజ్‌ కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -