శర్వా నటించిన నూతన చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు. ఈనెల 14న విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుని సంక్రాంతి విన్నర్‌గా హౌస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సంక్రాంతి విన్నర్ మీట్ నిర్వహించారు. హీరో శర్వా మాట్లాడుతూ, ‘ఇది నాకు చాలా ఎమోషనల్ మూమెంట్. హిట్ కొడతానని చెప్పాను. చెప్పి కొట్టాను. ఇది గర్వంతోనో, పొగరుతోనో మాట్లాడటం లేదు. చాలా హంబుల్‌గా చెప్తున్నాను. హిట్టు కొడతానని అంత నమ్మకంగా చెప్పడానికి కారణం ఈ కథ. రామ్, నందు, భాను వాళ్లు రాసిచ్చిన కథ మొదటి రోజు నుంచే నాకు ఎంతో నమ్మకాన్ని కలిగించింది.
ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేసినా బ్లాక్‌బస్టర్ అవుతుందని అనిల్‌కి ముందే చెప్పాను. సంక్రాంతి అనేది రెవెన్యూ పరంగా 40, 50% పెరుగుతుంది. రామ్ అబ్బరాజు లాంటి డైరెక్టర్ ఇండస్ట్రీకి కావాలి. తను ప్రొడ్యూసర్ డైరెక్టర్. నాకు కథ ఎలా చెప్పాడో అంతకంటే అద్భుతంగా తీశాడు. చాలా రోజులుగా హిట్ కోసం ఎదురుచూస్తున్నాను. ఆ హిట్ ఇచ్చిన రామ్‌కి థ్యాంక్యూ, యువరాజ్ చాలా అద్భుతమైన ఫోటోగ్రఫీ చేశారు. దిల్ రాజు సపోర్టు నాకు ఎప్పుడు ఉంటుంది. మంచి థియేటర్లు ఇచ్చారు. నేను ఎప్పుడు సంక్రాంతికి వచ్చిన అన్ని సినిమాలు ఆడుతాయి. ‘ఎక్స్‌ప్రెస్ రాజా’, ‘శతమానం భవతి’ తరువాత మరో సంక్రాంతి హిట్ రావడం చాలా ఆనందంగా ఉంది’ అని తెలిపారు.
సంక్రాంతి విజేతగా నిలబెట్టారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



