సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి, థియేటర్లలో నవ్వుల వర్షం కురిపిస్తూ సంచలన విజయం దిశగా దూసుకుపోతున్న చిత్రం ‘అనగనగా ఒక రాజు’. నవీన్ పొలిశెట్టి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయిక. కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.41.2 కోట్ల భారీ వసూళ్లతో సంచలనం సృష్టించిందీ చిత్రం. ప్రేక్షకుల సంపూర్ణ మద్దతుతో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురుస్తున్న నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం థ్యాంక్యూ మీట్‌ని నిర్వహించి, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ,’మాకు ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు పేరుపేరునా కృతజ్ఞతలు. సితార ఎంటర్టైన్మెంట్స్ అనేది బ్లాక్ బస్టర్ ప్రొడక్షన్ హౌస్. ఎన్నో మైలురాయి లాంటి చిత్రాలను అందించారు. అలాంటి సంస్థ నుంచి ఇటీవల ఒకట్రెండు సినిమాలు ఆశించినస్థాయి విజయాన్ని అందుకోలేకపోయాయి.
ఇలాంటి తరుణంలో ఈ సినిమా రూపంలో ప్రేక్షకులు బ్లాక్‌బస్టర్‌ను అందించడం.. మా అందరికీ సంతోషాన్ని కలిగించింది. ముఖ్యంగా నాగవంశీ ముఖంలో చిరునవ్వు చూడటం సంతోషాన్ని ఇచ్చింది. ఆయన ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను. కథానాయకుడిగా నా మొదటి సంక్రాంతి సినిమా. పోటీలో పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ మా సినిమాని బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు’ అని అన్నారు. ‘ఆరేళ్ళ తర్వాత నాకు సంతృప్తిని ఇచ్చిన సంక్రాంతి ఇది. 2020లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా తర్వాత ఆ స్థాయి తృప్తిని ఇచ్చిన సంక్రాంతి ఇది. అందరి ఆశీస్సులతోనే ఈ స్థాయి విజయం లభించింది. అలాగే అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా ఎంతగానో మద్దతు తెలుపుతున్నారు. ఆ అభిమానులంతా సంతోషపడే భారీ ప్రకటన త్వరలోనే రాబోతుంది. ఈ సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు విడుదలైనప్పటికీ.. మా డిస్ట్రిబ్యూటర్లు అందరూ తగినన్ని థియేటర్లను మాకు కేటాయించి ఎంతో అండగా నిలిచారు. అందుకే రెండు రోజుల్లోనే రూ.41 కోట్ల గ్రాస్ రాబట్టగలిగింది’ అని నిర్మాత సూర్యదేవర నాగవంశీ చెప్పారు.
ఆరేళ్ళ తరువాత..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



