Saturday, January 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంతెలంగాణలో సైనిక్‌ స్కూల్‌ ఏర్పాటు చేయండి

తెలంగాణలో సైనిక్‌ స్కూల్‌ ఏర్పాటు చేయండి

- Advertisement -

ఆర్మీ అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్రంలో సైనిక్‌ స్కూల్‌ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆర్మీ అధికారులను కోరారు. ఈమేరకు గురువారం హైదరాబాద్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో ఆయన ఆర్మీ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు విజ్ఞప్తులను ఆర్మీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సదరన్‌ కమాండ్‌ సెంటర్‌ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్‌కు మార్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, మేజర్‌ జనరల్‌ అజయ్ మిశ్రా ఉన్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ దేశంలో వివిధ రాష్ట్రాలకు రెండు నుంచి నాలుగు సైనిక్‌ స్కూల్స్‌ మంజూరు చేశారని గుర్తు చేశారు. తెలంగాణలో పదేండ్లుగా సహకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందని స్పష్టం చేశారు. అందులో భాగంగానే వికారాబాద్‌లో ఫ్రీక్వెన్సీ నేవీ రాడార్‌ స్టేషన్‌కు మూడువేల ఎకరాల భూమిని కేటాయించినట్టు గుర్తు చేశారు. ఆర్మీ, తెలంగాణ ప్రభుత్వం మధ్య సమస్యల పరిష్కారం, చర్చలకు సంబంధించి ఆర్మీ వైపు నుంచి కూడా ప్రత్యేక అధికారులను నియమించాలని కోరారు. నిరంతరం చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని ఆర్మీ అధికారులను కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -