చౌటుప్పల్‌లో కేసు నమోదు
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్/ సంస్థాన్ నారాయణపురం
యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో భూభారతి రిజిస్ట్రేషన్ లావాదేవీల్లో భారీగా అవినీతి జరిగినట్టు తహసీల్దార్ బి.వీరబాయి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శుక్రవారం తహసీల్దార్ ఇచ్చిన పిటిషన్ ఆధారంగా చౌటుప్పల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మన్మధ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే.. భూభారతి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొంతమంది డాక్యుమెంట్ రైటర్లు తమకు కేటాయించిన యూజర్ ఐడీలను దుర్వినియోగం చేస్తూ తక్కువ స్టాంప్ డ్యూటీ చెల్లించి రిజిస్ట్రేషన్ బుకింగ్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ అక్రమాల ద్వారా ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసి ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం కలిగించినట్టు అధికారులు గుర్తించారు. మొత్తం 240 డాక్యుమెంట్లలో 237 డాక్యుమెంట్లు అవినీతి జరిగినట్టు మిగిలిన 3 డాక్యుమెంట్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నట్టు ఫిర్యాదులో స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి రూ. కోటీ 15 లక్షలా 50 వేలా 157 మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఆరుగురు డాక్యుమెంట్ రైటర్లపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
నారాయణపురంలో డాక్యుమెంట్ రైటర్ల రిమాండ్
నారాయణపురం మండల తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు మేరకు భూ రిజిస్ట్రేషన్లలో అక్రమాలకు పాల్పడిన డాక్యుమెంట్ రైటర్లు వంశీ, వెంకటేశ్వర్లు, నరేష్ లను శుక్రవారం అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరిచినట్టు ఎస్సై జై.జగన్ తెలిపారు. డాక్యుమెంట్ రైటర్లు వంశీ, వెంకటేశ్వర్లు, నరేష్ భూభారతి యాప్ ద్వారా భూమి అమ్మకాలు, కొనుగోలు ప్రభుత్వ వ్యాల్యూషన్ ప్రకారం చలాన్ డబ్బులు చెల్లించకుండా అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు.
భూభారతి రిజిస్ట్రేషన్‌లో రూ.1.15 కోట్ల అవినీతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



