Saturday, January 17, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయం75 దేశాల ఇమ్మిగ్రేషన్‌ వీసాల రద్దు

75 దేశాల ఇమ్మిగ్రేషన్‌ వీసాల రద్దు

- Advertisement -

అమెరికా విదేశాంగశాఖ నిర్ణయం

వాషింగ్టన్‌ : 75 దేశాలకు చెందిన పౌరులకు ఇమ్మిగ్రేషన్‌ వీసాలను జారీ చేసే ప్రక్రియను అమెరికా నిలిపివేసింది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. విదేశాంగ శాఖ కార్యదర్శి మార్కో రూబియో నవంబర్‌లో జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం 75 దేశాల ప్రజల నుంచి వీసా దరఖాస్తులను స్వీకరించే ప్రక్రియను నిలివేయాలని కాన్సులర్‌ అధికారులను అదేశించినట్టు పేర్కొంది. ఈ సస్పెన్షన్‌ వలసేతర వీసాలు, తాతాల్కిక పర్యాటక, వ్యాపార వీసాలను కోరుకునే దరఖాస్తులకు వర్తించదని వివరించింది. ఈ ప్రకటన ఏయే దేశాలకు ఇమ్మిగ్రేషన్‌ వీసాలను రద్దు చేస్తున్నట్టో స్పష్టం చేయలేదు. వీటిలో ఎక్కువగా ఆఫ్రికా దేశాలు ఉన్నట్టు సమాచారం. రష్యా, ఇరాన్‌, సోమాలియా, ఆఫ్ఘనిస్తాన్‌, బ్రెజిల్‌, ఈజిప్టు వంటి దేశాలు ఉన్నాయని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక అమెరికా అధికారి తెలిపారు. ఈ 75 దేశాల జాబితాను అమెరికా ప్రభుత్వం ఇంకా బహిరంగపర్చనందున తన పేరు చెప్పడానికి ఆ అధికారి ఇష్టపడలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -