Saturday, January 17, 2026
E-PAPER
Homeబీజినెస్అమ్మకాలు లేక టెస్లా కార్ల ధరల తగ్గింపు

అమ్మకాలు లేక టెస్లా కార్ల ధరల తగ్గింపు

- Advertisement -

న్యూఢిల్లీ : ప్రపంచ కుబేరుడు ఎలన్‌మస్క్‌కు చెందిన టెస్లా కార్లకు భారత్‌లో డిమాండ్‌ సన్నగిల్లింది. డెలివరీలు లేక దిగుమతి చేసుకున్న కార్ల నిల్వలు పెరిగిపోవడంతో ఏమి చేయలో తెలియక ఎలాగోలా అమ్ముకోవడానికి భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తోంది. అమ్మకాలు ఊహించిన స్థాయిలో లేకపోవడంతో ఆ కంపెనీ విక్రయిస్తోన్న మోడల్‌ ‘వై’ పై ఏకంగా రూ.2 లక్షల వరకు డిస్కౌంట్‌ అందిస్తోన్నట్లు వెల్లడించింది. స్టాక్‌ను క్లియర్‌ చేసేందుకు ఈ మార్గాన్ని ఎంచుకుంది. గతేడాది టెస్లా 300 మోడల్‌ వై కార్లను దిగుమతి చేసుకోవగా.. అందులో మూడోవంతు కార్లు కూడా విక్రయం కాలేదు. కొన్ని నెలలుగా షోరూమ్‌లకే పరిమితమయ్యాయి. దీంతో ఈ కార్లను ఎలాగైనా విక్రయించాలని రూ.2 లక్షల వరకు వివిధ రూపాల్లో డిస్కౌంట్లు అందిస్తోందని బ్లూమ్‌బర్గ్‌ ఓ రిపోర్ట్‌లో తెలిపింది. భారత్‌లో ఈ మోడల్‌ ధరను రూ.60 లక్షలుగా నిర్ణయించింది. ఇదే ధరలో ఇతర లగ్జరీ కంపెనీల్లో మంచి మోడళ్లు లభించడంతో వినియోగదారులు అటువైపు మొగ్గు చూపుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -