Saturday, January 17, 2026
E-PAPER
Homeబీజినెస్సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ లాభాల్లో 9 శాతం వృద్ధి

సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ లాభాల్లో 9 శాతం వృద్ధి

- Advertisement -

హైదరాబాద్‌ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ 9 శాతం వృద్ధితో రూ.374.32 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.341.87 కోట్ల లాభాలు నమోదు చేసింది. త్రిసూర్‌ కేంద్రంగా పని చేస్తోన్న ఈ బ్యాంక్‌ 2025 డిసెంబర్‌తో ముగిసిన తొమ్మిది మాసాల కాలంలో రూ.1,047.64 కోట్ల నికర లాభాలు ప్రకటించింది. ఇంతక్రితం ఏడాది ఇదే సమయంలో రూ.960.69 కోట్ల లాభాలు ఆర్జించింది. బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తులు 4.30 శాతం నుంచి 2.67 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పిఎలు 1.25 శాతం నుంచి 0.45 శాతానికి దిగివచ్చాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -