Saturday, January 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకేసీఆర్‌ది నిజమైన పాలన..కాంగ్రెస్‌ది కటకట పాలన

కేసీఆర్‌ది నిజమైన పాలన..కాంగ్రెస్‌ది కటకట పాలన

- Advertisement -

మాచాపూర్‌ రచ్చబండ వద్ద వృద్ధులతో హరీశ్‌రావు ముచ్చట

నవతెలంగాణ-సిద్దిపేటరూరల్‌
‘కేసీఆర్‌ పరిపాలన ఉన్నప్పుడే అన్ని కరెక్ట్‌గా జరిగాయి.. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో మాకు అన్ని సమస్యలు కటకటలే.. ఇస్తామన్న హామీలు కూడా ఇవ్వట్లేదు’ అంటూ పలువురు వృద్ధులు మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సిద్దిపేటరూరల్‌ మండలం మాచాపూర్‌లోని రచ్చబండ వద్ద కూర్చున్న గ్రామ పెద్దలు, వృద్ధులతో హరీశ్‌రావు ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘రేవంత్‌ రెడ్డి రూ.4 వేలు ఇస్తానంటే నమ్మి ఓట్లేసాం. కానీ ఆ ఊసే లేదు. కేసీఆర్‌ ఉన్నప్పుడు 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు వయసు తగ్గించి మరీ పెన్షన్‌ ఇచ్చారు.

ఇప్పుడు భర్త చనిపోయిన వాళ్లకు వయసు మళ్లిన వాళ్లకు పెన్షన్లు ఇవ్వడం లేదు. రైతుబంధు కూడా అందరికీ వేయడం లేదు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి .ఎరువుల కోసం లైన్లలో నిలబడాల్సి వస్తోంది. బస్సుల్లో ఆడవాళ్లకు ఫ్రీ అన్నారు. కానీ పురుషులకు టికెట్‌ ఛార్జీలు తడిసి మోపెడవుతున్నాయి’ అంటూ వృద్ధులు, స్థానికులు హరీశ్‌రావుతో అన్నారు. మీరు ధైర్యంగా ఉండండి.. నేను మీ తరుపున అసెంబ్లీలో కొట్లాడుతా’ అని గ్రామస్తులతో హరీశ్‌రావు తెలిపారు. ‘మీరు అడిగిన బోర్లకు సంబంధించి ఈ నెలలోనే టెండర్‌ పూర్తవుతుంది. కలెక్టర్‌తో మాట్లాడి నెల రోజుల్లో పనులు మొదలుపెట్టేలా చూస్తాను’ అని భరోసా ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -