Saturday, January 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం'వీర భారతం' నృత్యరూపకం గోడపత్రిక ఆవిష్కరణ

‘వీర భారతం’ నృత్యరూపకం గోడపత్రిక ఆవిష్కరణ

- Advertisement -

ఇది అనన్య సామాన్యం : సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ

నవతెలంగాణ-ముషీరాబాద్‌
ఈ నెల 23న రవీంద్రభారతిలో ప్రదర్శించనున్న ‘వీర భారతం’ నృత్యరూపకానికి సంబంధించిన గోడపత్రిక(వాల్‌ పోస్టర్‌)ను కవి, రచయిత, జాతీయ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ ఆవిష్కరించారు. శుక్రవారం హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అశోక్‌తేజ మాట్లాడుతూ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని సుద్దాల ఫౌండేషన్‌ సమర్పణలో త్రైలోక్య ఆర్ట్స్‌ అసోసియేషన్‌ వారిచే ‘వీర భారతం’ నృత్యరూపకం రవీంద్రభారతి ప్రధాన ఆడిటోరియంలో ప్రదర్శించనున్నట్టు తెలిపారు. కలం నుంచి జాలువారిన స్వాతంత్య్ర సమరాంగణ ఘట్టాలను నృత్య రూపకంగా మలచిన విధానం విశిష్టంగా నిలుస్తుందన్నారు.

ఇదొక అనన్య సామా న్యమని అన్నారు. భారత స్వాతంత్య్ర సంగ్రామాన్ని 56 నిమిషాల్లో ఆవిష్కరించడం ద్వారా నేటి పిల్లలకు మన పోరాట చరిత్రను గుర్తుచేయడమే ఈ నాటక ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఐఏఎస్‌ కె.వి. రమణ, ప్రొ.ఏ.ఎస్‌.ఏనుగు నరసింహారెడ్డి, ప్రొ.వేదకుమార్‌, ప్రొ.సీహెచ్‌. వేణుగోపాల్‌ రెడ్డి, సినీ నటుడు ఉత్తేజ్‌, ప్రజాశక్తి మాజీ ఎడిటర్‌ ఎస్‌. వినయ్ కుమార్‌, బాలోత్సవ అధ్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొననున్నారని చెప్పారు. కార్యక్రమంలో బాలోత్సవం అధ్యక్ష కార్యదర్శులు భూపతి వెంకటేశ్వర్లు, ఎన్‌. సోమయ్య, కోశాధికారి జి. బుచ్చిరెడ్డి, ఎస్‌వీకే జోసిల్లా, ప్రేమ, రజిత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -