Monday, May 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాటారంలో కల్తీ బీర్ల దందా

కాటారంలో కల్తీ బీర్ల దందా

- Advertisement -

అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు
నవతెలంగాణ-కాటారం 

కాటారం పట్టణంలో కల్తీ బీర్ల విక్రయం జరుగుతోందన్న ఆరోపణలు స్థానికంగా ఆందోళన కలిగిస్తున్నాయి. తక్కువ ధర గల బీర్లపై ప్రీమియం బ్రాండ్ల స్టిక్కర్లు అతికించి విక్రయిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా “కింగ్ ఫిషర్ లైట్” పేరుతో నకిలీ స్టిక్కర్లు ఉపయోగించి వినియోగదారులను మోసం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం వినియోగదారుల ఆరోగ్యానికి ముప్పుగా మారే అవకాశం ఉన్నప్పటికీ, నియంత్రణ బాధ్యత కలిగిన ఎక్సైజ్ శాఖ నుంచి తగిన చర్యలు కనిపించకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. పట్టణంలో ఈ దందా బహిరంగంగానే కొనసాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే తనిఖీలు, కేసులు నమోదు వంటి చర్యలు కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలోనే ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయన్న విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. “అధికారులకు సమాచారం లేదా? తెలిసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?” అనే ప్రశ్నలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖలు స్పందించి, కల్తీ బీర్ల విక్రయంపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే మద్యం విక్రయ కేంద్రాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, వినియోగదారుల భద్రతకు హామీ కల్పించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -