నవతెలంగాణ – మల్హర్ రావు
మండల వ్యాప్తంగా సంక్రాంతి పండుగ వేడుకలను అంగరంగవైభవంగా గురువారం నిర్వహించారు. ప్రతి గ్రామంలో ఉదయాన్నే లేచి సూర్యుడు మకరరాశిలోకి సంక్రమించిన తరువాత చిన్నలు, పెద్దలు తల స్నానాలు ఆచరించారు. దీంతో పిడలు తొలిగిపోతాయని ప్రజల ప్రగాఢ నమ్మకం. బోగిపళ్ళు పోయడం ద్వారా వారిపై ఉన్న దోషాలు తొలగిపోతాయని భావించారు. నువ్వులు, బెల్లం కలిసిన పిండి వంటలను భుజిస్తారు. మహిళలు గౌరీదేవిని పూజించారు. వాకిళ్లలో రంగురంగుల ముగ్గులు, బొబ్బెమ్మలు అలరించారు. గ్రామాల్లో ఉట్టి కొట్టే కార్యక్రమాలు, మహిళలకు ముగ్గుల పోటీలు, యూత్ కు క్రికెట్, వాలీబాల్, కబడ్డీ క్రీడల పోటీలు నిర్వహించి, గెలుపొందింనవారికి బహుమతులు ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు బండి స్వామి, మేకల రాజయ్య, బండారి నర్సింగరావు, జంగిడి శ్రీనివాస్, గడ్డం క్రాoతి, అజ్మీరా సారక్క, చంద్రగిరి సంపత్, అబ్బినేని లింగస్వామి, కొండ రాజమ్మ, ఉప సర్పంచ్ లు బొబ్బిలి రాజు గౌడ్, తాళ్ల రవిందర్, అక్కల దేవేందర్ యాదవ్, మాజీ పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య, మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు, వార్డు సభ్యులు వొన్న తిరుపతి రావు, ఇందారపు చెంద్రయ్య,సా రయ్య, జంబోజు సంధ్యారాణి-రవిందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య, నాయకులు జక్కుల వెంకటస్వామి యాదవ్, భోగే మల్లయ్య, చిగురు సదయ్య, అడ్వాల మహేష్ పాల్గొన్నారు.



