- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల సర్పంచ్ గా బండి స్వామి, ఉప సర్పంచ్ గా బొబ్బిలి రాజు గౌడ్ ఇటీవల బాధ్యతలు చేపట్టారు. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని గురువారం లక్ష్మీ దేవర అమ్మవారిని దర్షించుకోవడానికి వచ్చిన వారిని ఆలయ చైర్మన్ ముద్దరవేని సురేష్, ముదిరాజ్ సంఘం నాయకులు ఆకుల ఓదెలు, రాజేష్, నర్సింగం, రాజయ్య, కిష్టయ్య, ఓదెలు, మొగిలి తదితరులు శాలువాతో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి నరేశ్ గౌడ్, మెరుగు రాజయ్య, ముదిరాజ్ కులస్తులు పాల్గొన్నారు.
- Advertisement -



