తెలంగాణ జేఏసీ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్
నవతెలంగాణ – అచ్చంపేట
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొరకు ఉద్యమించిన ఉద్యమకారులకు ప్రభుత్వం 250 గజాలు ఇంటి స్థలం ఇవ్వాలని తెలంగాణ జేఏసీ రాష్ట్ర నాయకులు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎవరెవరు ఉద్యమించారు, పని గుర్తించడానికి జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రజాపాలన రెండేళ్లు గడిచిందని కాలయాపన చేయకుండా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. 15 రోజులలో ప్రభుత్వం ప్రకటించాలని లేకపోతే మరో ఉద్యమా పోరాటానికి ప్రణాళికలు రూపొందించుకొని జనవరి 30న ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు.
ఉద్యమకారులకు ఇంటి స్థలాలివ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



