నవతెలంగాణ – కుభీర్
మండల కేంద్రమైన కుభీర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం సీఎం కప్ పోటీలను మండల అధికారి సాగర్ రెడ్డి మండల విద్యాధికారి విజయ్ కుమార్ లు సీఎం కప్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్బంగా మండల అధికారి ఎంపీడీఓ సాగర్ రెడ్డి విద్యాధికారి విజయ్ కుమార్ లు మాట్లాడుతూ.. మండలంలో 42 గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు సీఎం కప్ పోటీలలో పాల్గొని జిల్లాస్థాయిలో గెలుపొందేలా పట్టుదలతో కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు. దింతో మండలంలోని ఆయా గ్రామాల్లో ఉన్న పాఠశాలలో నాలుగు క్లస్టర్లు గా విడదీసి పోటీలను నిర్వహించడం జరుగుతుంది. ఇందులో గెలుపొందిన వారు మండల స్థాయిలో గెల్చి జిల్లా స్థాయికి ఎంపిక చేస్తారు. ఈ పోటీలో కోకో కబడ్డీ వాలీబాల్ పోటీలను నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగాధర్, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.
సీఎం కప్ పోటీలను ప్రారంభించిన ఎంపీడీవో సాగర్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



