Saturday, January 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలూర్ మండల నూతన సర్పంచ్‌లకు శిక్షణా తరగతులు: ఎంపీడీఓ

ఆలూర్ మండల నూతన సర్పంచ్‌లకు శిక్షణా తరగతులు: ఎంపీడీఓ

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
ఆలూర్ మండలంలోని నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు ఫిబ్రవరి 9 నుండి 13 వరకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ గంగాధర్ శనివారం తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమం జిల్లా కేంద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ (NAC) లో నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ శిక్షణ తరగతుల్లో గ్రామ పంచాయతీల విధులు, బాధ్యతలు, స్థానిక స్వపరిపాలన వ్యవస్థ, గ్రామాభివృద్ధి ప్రణాళికల తయారీ, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలు, ఆర్థిక నిర్వహణ, రికార్డుల సంరక్షణ, పారదర్శక పాలన, ప్రజల సమస్యల పరిష్కారం వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.

నూతన సర్పంచ్‌లు పరిపాలనా అనుభవం పెంపొందించుకొని గ్రామాల సమగ్ర అభివృద్ధికి కృషి చేయడానికి ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని  పేర్కొన్నారు. ఆలూర్ మండలంలోని అన్ని గ్రామాల నూతన సర్పంచ్‌లు తప్పనిసరిగా హాజరై శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -