మున్సిపల్ కమిషనర్ శ్రావణి
నవతెలంగాణ – ఆర్మూర్
సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక ముగ్గులు అని మున్సిపల్ కమిషనర్ పూజారి శ్రావణి అన్నారు. పట్టణంలోని తిరుమల కాలనీలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఏడవ వార్డు ఇంచార్జ్ దూదిగామ నటరాజ్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని రంగురంగుల ముగ్గులు వేశారు. ముఖ్యఅతిథిగా మున్సిపల్ కమిషనర్ శ్రావణి హాజరయ్యారు. గెలుపొందిన మహిళలకు కమిషనర్ శ్రావణి బహుమతులు ప్రధానం చేశారు.
ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన వార్డు ఇంచార్జ్ నటరాజ్ ను కమిషనర్ అభినందించారు. ముగ్గులు వేసిన మహిళలకు, ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు వేసిన ముగ్గులు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచాయన్నారు. అందరూ కలిసి ఒకే చోట ముగ్గులు వేయడం వల్ల మానవ సంబంధాల మధ్య ఐక్యత పెరుగుతుందన్నారు. ఇలాంటి పోటీలు నిర్వహించడం వల్ల మన దేశ నాగారికత సంస్కృతిని కాపాడుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.



