వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు
నవతెలంగాణ – బోనకల్
వికసిత్ భారత్ జి రామ్ జి చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని వ్యవసా కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని బోనకల్ మండల కేంద్రంలో గల వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల భవనంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ సమావేశం అధ్యక్షులు తెల్లాకుల శ్రీనివాసరావు అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి గ్యారెంటీ చట్టం 2005 పేరును తొలగిస్తూ భారత్ జి రామ్ జి చట్టంగా మార్పు చేశారని దీనివలన వ్యవసాయ కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు.
దేశంలో కోట్లాదిమంది వ్యవసాయ కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టాన్ని రద్దు చేయటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. జాతీయ గ్రామీణ ఉపాధ్యాయుని చట్టం ప్రకారం వ్యవసాయ కార్మికులకు సంవత్సరంలో వంద రోజులు పని కల్పించాలని ప్రస్తుతం రోజుకు 307 రూపాయలు ఇవ్వాలని చట్టంలో ఉందన్నారు. కానీ బిజెపి ప్రభుత్వం దానిని రద్దు చేసింది అన్నారు. కేంద్ర ప్రభుత్వం 90 శాతం రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం భరించవలసి ఉందన్నారు. కానీ కొత్త చట్టం ప్రకారం రాష్ట్రాలు 40 శాతం భరించాలని నిర్ణయించిందన్నారు. దేశంలో అనేక రాష్ట్రాలు 40 శాతం భరించే పరిస్థితుల్లో లేవన్నారు. దీనివలన వ్యవసాయ కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. సమైక్య పోరాటాల ద్వారా ఉపాదామీ పథకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వ్యవసాయ కార్మిక సంఘం అనేక రూపాలలో ఆందోళనలు పోరాటాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ పోరాటాలలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ప్రజలు ఆర్థికంగా బలపడే విధానాలను పాలకుల అమలు చేయకుండా ఆర్థికంగా బలహీనపడే విధానాలను అమలు చేస్తున్నాయని విమర్శించారు. పెట్టుబడిదారులకు ఉపయోగపడే చట్టాలను తీసుకువస్తూ కార్మికులకు వ్యవసాయ కార్మికులకు ఉపయోగపడే చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తుందని విమర్శించారు. భాగమే నాలుగు లేబర్ కోడ్ లు అన్నారు. వీటిని రద్దు చేసే వరకు వ్యవసాయ కార్మిక సంఘం పోరాటాలు చేస్తుందని స్పష్టం చేశారు.
బిజెపి ప్రభుత్వం మతోన్మాదంతో దేశాన్ని విచ్చర్నం చేసేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు. భారత రాజ్యాంగాన్ని మార్చి బిజెపి రాజ్యాంగాన్ని అమలు చేస్తుందని దీనిని దేశ ప్రజలందరూ తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం మధిర డివిజన్ అధ్యక్షులు బంధం శ్రీనివాసరావు, ఆ సంఘం మండల కమిటీ సభ్యులు నోముల పుల్లయ్య, కొమ్ము కమలమ్మ, ఉప్పర శ్రీను, కూచిపూడి మురళి కృష్ణ, సూర్య ప్రకాష్ రావు, కోట వెంకటి, పిక్కల సీతారాములు, కర్లకుంట ముత్తయ్య, చేపూరి వెంకటేశ్వర్లు, ముంగి వెంకన్న, కొంగర భూషయ్య, కొమ్మినేని సీతారాములు,దూబ భద్రాచలం తదితరులు పాల్గొన్నారు.



