Saturday, January 17, 2026
E-PAPER
Homeఖమ్మంసీపీఐ శతాబ్ది ముగింపు ఉత్సవాలను జయప్రదం చేయండి 

సీపీఐ శతాబ్ది ముగింపు ఉత్సవాలను జయప్రదం చేయండి 

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర కౌలు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జక్కుల రామారావు
నవతెలంగాణ – బోనకల్ 

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోనే బోనకల్ మండల పరిధిలో ఈ సమావేశం జరిగింది. సీపీఐ శతాబ్ది ముగింపు ఉత్సవాల సందర్భంగా ఈ నెల18న ఖమ్మం నగరంలో 5 లక్షల మందితో నిర్వహించే ‘భారీ బహిరంగ సభ’కు రైతులు, వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు  పెద్దఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని తెలంగాణ రాష్ట్ర కౌలు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఏఐకేఎస్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి జక్కుల రామారావు కోరారు. మండల  కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో సిపిఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ బహిరంగ సభకు 40 దేశాల ప్రతినిధులు హాజరవుతారన్నారు.

వంద సంవత్సరాల త్యాగాల చరిత్ర కలిగిన పార్టీ సీపీఐ అని అన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన భారత స్వాతంత్రోద్యమంలో అనేక నిషేధాజ్ఞలు ఎదుర్కొంది అన్నారు. ఎన్నో విజయాలు సాధించి దేశ రాజకీయ చరిత్రలో సీపీఐ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందన్నారు. సీపీఐ 100 సంవత్సరాల ముగింపు ఉత్సవాలకు ప్రజలు అన్ని వర్గాల వారు సహకరించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ కె ఎస్ మండల అధ్యక్షులు కొంగర భాస్కరరావు, మండల కార్యవర్గ సభ్యులు ఆకెన పవన్, చిరునోముల గ్రామ కన్వీనర్ గుంపుల జయరాజు, బోళ్ల ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -