రైతు కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి ..
వ్యకాస రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య
నవతెలంగాణ- మునుగోడు
ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో మోడీ సర్కార్ వినాశకర పాలన కొనసాగిస్తుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారీ ఐలయ్య రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండ శ్రీశైలం తెలియజేశారు. శనివారం మునుగోడు మండల కేంద్రంలో కార్మిక కర్షక పోరుబాట జీబు జాత ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం కేవలం ఆర్ఎస్ఎస్ నిర్దేశించిన మతోన్మాద ఎజెండాను అమలు చేస్తూ, దేశాన్ని కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెడుతోందని విమర్శించారు.
కార్పొరేట్ మతోన్మాద బంధం అదానీ, అంబానీ లాంటి బడా దోపిడీదారులకు దేశ సంపదను ధారపోస్తూ, మరోవైపు ప్రజల మధ్య మత విద్వేషాలను రగిల్చి దేశాన్ని విచ్ఛిన్నం చేస్తోందని డబుల్ ఇంజిన్ విధ్వంసం డబుల్ ఇంజిన్, బుల్డోజర్ సర్కార్ల పేరుతో పేదల ఇళ్లను కూలుస్తూ, గిరిజన, పేదల భూములను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. ఉపాధి హామీ నిర్వీర్యం , సమ్మెకు సమరశంఖం యునైటెడ్ ఫ్రంట్ హయాంలో సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని మోడీ సర్కార్ పథకం ప్రకారం నీరుగారుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త లేబర్ కోడ్స్ కేవలం కార్పొరేట్, కమ్యూనల్, గ్రామీణ ధనిక వర్గాల ప్రయోజనాల కొసమెనని , ఈ దోపిడీ పాలనపై తుది పోరాటంగా ఫిబ్రవరి 12న జాతీయ సమ్మె నిర్వహించబోతున్నట్లు తెలిపారు.
ఉపాధి హామీ రక్షణ కోసం ఏర్పడిన “విశాల ఐక్య వేదిక” ద్వారా దేశవ్యాప్తంగా కార్మిక, రైతు వర్గాలను ఏకం చేసి, కార్పొరేట్ , మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 19న నల్గొండలో జరిగే కార్మిక కర్షక మైత్రి దినం సభకు రైతులు , కూలీలు , కార్మికులు , పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు .ఈ కార్యక్రమంలో గొర్రెల మేకల పెంపక దారుల సంఘం జిల్లా అధ్యక్షుడు సాగర్ల మల్లేశం ప్రజాసంఘాల నాయకులు సిఐటియు నాయకులు యాసరాణి శ్రీను, వ్యవసాయ కార్మిక సంఘము మండల కార్యదర్శి శివర్ల మహేష్, డివైఎఫ్ఐ జిల్లా నాయకులు మిర్యాల భరత్, రైతు సంఘము మండల నాయకులు వడ్ల మూడి హనుమయ్య, యాట యాదయ్య,రమేష్ , శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.



