12 వార్డులు రిజర్వేషన్ ఖరారు
నవతెలంగాణ – ఆలేరు
నియోజకవర్గ కేంద్రం ఆలేరు మున్సిపాలిటీ ఎన్నికల అధికారులు రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకొని చేసిన రిజర్వేషన్లలో ఆలేరు మున్సిపాలిటీ బీసీ మహిళగా రిజర్వేషన్ అయింది. వార్డ్ కౌన్సిలర్లు రిజర్వేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం కలెక్టర్ హనుమంతరావు సమక్షంలో యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని మున్సిపాలిటీల వార్డుల రిజర్వేషన్లు ఎంపిక జరిగింది.
1 వార్డ్ జనరల్ మహిళ
2 వార్డ్ ఎస్ సి మహిళ
3 వార్డు జనరల్
4 వార్డ్ జనరల్ మహిళ
5 వార్డ్ బీసీ జనరల్
6 వార్డ్ ఎస్టి జనరల్
7 వార్డ్ జనరల్ మహిళ
8 వార్డ్ బీసీ జనరల్
9 వార్డ్ ఎస్సీ జనరల
10 వార్డ్ బిసి మహిళ
11 వార్డు జనరల్
12 వార్డ్ జనరల్ మహిళ గా
రిజర్వేషన్ ఖరారు అయ్యాయి. కథ మున్సిపాలిటీ ఎన్నికల్లో చైర్మన్ పదవి బీసీ జనరల్. ఉన్నది. ప్రస్తుతం బీసీ మహిళా గా మారింది. వార్డుల విషయానికి వస్తే 8 వ వార్డు గతంలో మహిళగా ఉన్నది ఇప్పుడు బిసి జనరల్ గా మారింది. గతంలో 2వ ,10వ, వార్డులు ఎస్సీ గా ఉండగా ప్రస్తుతం 10వ వార్డు బీసీ మహిళగా మారింది. 2 వార్డ్ ఎస్సీ మహిళగా తొమ్మిదవ వార్డ్ ఎస్సీ జనరల్ గా రిజర్వేషన్ అయ్యాయి. 2, 8, 9, 10. మార్పులు జరగగా మిగతా 8 వార్డులు యధావిధిగా గతంలో రిజర్వేషన్ ఉన్నట్లుగానే యధాతథంగా ఉన్నాయి. గతంలో ఎక్కువ స్థానాలు బి ఆర్ ఎస్ పార్టీ ఎక్కువ స్థానాలు దక్కించుకోవడంతో చైర్మన్ పదవి వస్పరి శంకరయ్యను వరించింది. రిజర్వేషన్ అనుకూలించలేదని బాధపడుతున్నారు. పోయినసారి ఓడిపోయిన కాంగ్రెస్ నాయకులు మాత్రం సంతోషంగా ఉన్నారు. రిజర్వేషన్లు యదార్థతగా ఉండడంతో పోటీ చేస్తే ఈసారి గెలుస్తామని ధీమాతో వ్యక్తం చేస్తున్నారు.



