Saturday, January 17, 2026
E-PAPER
Homeజిల్లాలుమండలంలో సీఎం కప్ టార్చ్ ర్యాలీలు

మండలంలో సీఎం కప్ టార్చ్ ర్యాలీలు

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని ఆయా గ్రామాల్లో శనివారం సీఎం కప్ టార్చ్ ర్యాలీలు నిర్వహించారు. మండల కేంద్రంలో స్థానిక జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల నుండి కొండ లక్ష్మణ్ బాపూజీ హాస కొత్తూర్ చౌరస్తా వరకు మండల స్థాయిలో సీఎం కప్-2026 టార్చ్ ర్యాలీ పెద్ద ఎత్తున నిర్వహించారు. మండల స్థాయి క్రీడా కమిటీ కన్వీనర్, మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీని కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నరసయ్య ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్, తహసిల్దార్ గుడిమేల ప్రసాద్, కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి, మండల పంచాయతీ అధికారి సదాశివ్, పంచాయతీ కార్యదర్శి గంగాజమున, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పసుపుల సాయన్న, పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ నాగభూషణం, విద్యార్థులు యువజన సంఘాల సభ్యులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

హాస కొత్తూర్ లో
మండలంలోని హస కొత్తూరు లో  సీఎం కప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్  నలిమెల రేవతి గంగారెడ్డి కాగడా జ్యోతి వెలిగించి ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు పెద్ది సృజాన్, కుందేటి శ్రీనివాస్, జుంబరత్ అశోక్, కనక నర్సయ్య, కల్లెడ రాణి, కల్లెడ కాశవ్వ, పంచాయతీ కార్యదర్శి నవీన్ గౌడ్, ప్రధానోపాధ్యాయులు అరుణ శ్రీ, ఉపాధ్యాయులు, ఏఎన్ఎం సుజాత, అంగన్వాడి టీచర్లు, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -