- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని మండల విద్యా వనరుల కేంద్రంలో శనివారం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం 2026 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య, మండల నోడల్ అధికారి గంగాధర్ చేతుల మీదుగా తపస్ నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మండలంలోని ఉపాధ్యాయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఎల్లవేళల ముందుంటుందని సందర్భంగా తపస్ మండల అధ్యక్షులు కిషన్ తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రమేష్, డివిజన్ కార్యదర్శి శంకర్, ఆనంద్, అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



