నవతెలంగాణ – వీర్నపల్లి
వీర్నపల్లి మండలం సీఎం కప్ టార్చ్ ర్యాలీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం కప్ క్రీడల ప్రచారంలో భాగంగా వీర్నపల్లి మండల కేంద్రంలో టార్చ్ ర్యాలీనీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మల్లారపు జ్యోత్స్న అరుణ్ కుమార్, ఎంపిడివో శ్రీలేఖ, ఎం ఈ ఓ శ్రీనివాస్, ఎస్సై వేముల లక్ష్మన్ కలిసి జ్యోతికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పల్లెల నుండి ప్రపంచ స్థాయి విజేతలకొరకు సీఎం కప్ ఈ నెల 8 నుంచి 17 వరకు నిర్వహించనున్నారు. పల్లెటూరి ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పడమే ఈ సీఎం కప్ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో యువజన క్రీడల శాఖ అధికారి రామ్ దాస్, అధికారులు,యువకులు తదితరులు పాల్గొన్నారు.
సీఎం కప్ టార్చ్ ర్యాలీ స్వాగతం పలికిన అధికారులు, నాయకులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



