- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
మండలంలోని పోసానిపేట జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతున్న 9వ తరగతి విద్యార్థిని పల్ల రుచిత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన అండర్ 14 ఖో ఖో టోర్నమెంట్ లో ఉత్తమ ప్రదర్శన కనబరచి, ఈ నెల 18వ తేదీ నుండి జనవరి 21వ తేదీ వరకు మహబూబ్ నగర్ జిల్లా నారాయణ పేట్ లో జరగనున్న రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ నరేష్ రెడ్డి ఒక ప్రకటనలో శనివారం తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ , గ్రామ సర్పంచ్ సుద్దాల లింగం, ఉప సర్పంచ్ గండ్ర అంజయ్య, వీడీసీ అధ్యక్షులు సాయిలు, ఉపాధ్యాయ బృందం, సీనియర్ క్రీడాకారులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ, విద్యార్థినికి అభినందనలు తెలిపారు.
- Advertisement -



