Saturday, January 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భిక్కనూర్ లో బ్లాక్ స్పాట్లపై అవగాహన

భిక్కనూర్ లో బ్లాక్ స్పాట్లపై అవగాహన

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
పట్టణ కేంద్రంలోని 44వ జాతీయ రహదారిపై శనివారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బ్లాక్ స్పాట్లను గుర్తించి వాహనదారులకు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే లక్ష్యంతో ‘ARRIVE–ALIVE’ కార్యక్రమంలో భాగంగా ప్రమాదకర బ్లాక్ స్పాట్లను అధికారులు పరిశీలించి ప్రమాదాలకు కారణమవుతున్న ప్రాంతాలను గుర్తించి, వాహనదారులు అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పించారు. ఎన్‌హెచ్‌ఏఐ, జీఎంఆర్ ప్రతినిధులకు బ్లాక్ స్పాట్ల వద్ద రోడ్డు వెడల్పు, సూచిక బోర్డులు, లైటింగ్ వంటి భద్రతా చర్యల్లో చేయవలసిన మార్పులపై సూచనలు చేశారు. రోడ్డు భద్రతను పెంచేందుకు సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ సంపత్ కుమార్, ఎస్సై ఆంజనేయులు, తాసిల్దార్ సునీత, ఎంపీడీవో రాజకీయం రెడ్డి, పోలీస్ సిబ్బందిని వాహనదారులు, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -