Saturday, January 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాంచంద్రపల్లిలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

రాంచంద్రపల్లిలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
ఆలూర్ మండలం రాంచంద్రపల్లి గ్రామంలో 9 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం బీజేపీ స్టేట్ ఎస్టి మోర్చా సెక్రెటరీ తౌడు మహేష్ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఆలూర్ మండలం అధ్యక్షులు సూర శ్రీకాంత్ మాట్లాడుతూ.. రాంచంద్రపల్లి  గ్రామంలో ప్రజలు ఎవరైనా అనారోగ్య రీత్యా ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం ఖర్చులను సీఎంఆర్ ద్వారా ఇప్పిస్తానని తమ దృష్టికి తీసుకురావాలన్నారు.

వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న వారికి అనారోగ్యంతో ఉంటే  ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఎల్ఓసి ఇప్పించి వైద్య సేవలు అందేలా చూస్తాను అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలూర్ మండల అధ్యక్షులు సుర శ్రీకాంత్,ఎస్టి మోర్చా స్టేట్ సెక్రెటరీ తౌడు మహేష్, బూత్ అధ్యక్షులు సతీష్, భూషణ్, వినోద్, సాయి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -