- Advertisement -
కథానాయకుడు వరుణ్ తేజ్, దర్శకుడు మేర్లపాక గాంధీ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. యువీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో దీన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబధించి మేకర్స్ ఎగ్జైటింగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా టైటిల్, గ్లింప్స్ ఈనెల 19న రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా వరుణ్ కెరీర్‌లోనే వెరీ స్పెషల్, ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్‌గా ఉండబోతోంది. హర్రర్, కామెడీ, ఇండియన్, కొరియన్ బ్యాక్‌డ్రాప్, యూనిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్. సత్య కీలక పాత్రలో కనిపించ నున్నారు. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం : మేర్లపాక గాంధీ, సంగీతం:ఎస్.తమన్.
- Advertisement -



