Sunday, January 18, 2026
E-PAPER
Homeసినిమాప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా

ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా

- Advertisement -

భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘యుఫోరియా’. రాగిణి గుణ సమర్పణలో గుణ హ్యాండ్‌ మేడ్‌ఫిల్మ్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ, యుక్తా గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భూమిక చావ్లా, గౌతమ్‌ వాసుదేవ్‌మీనన్‌, సారా అర్జున్‌, నాజర్‌, రోహిత్‌, విఘ్నేష్‌ గవిరెడ్డి, లిఖిత యలమంచలి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని మేకర్స్‌ తాజాగా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. ‘ధురందర్‌’ చిత్రంలో హీరోయిన్‌గా ఆకట్టుకున్న సారా అర్జున్‌ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తుండటం విశేషం. ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో నిర్మాత నీలిమ గుణ మాట్లాడుతూ, ‘ట్రైలర్‌ చూశాక చాలా ఎమోషనల్‌ అనిపించింది.

ఇంత ఇంపాక్ట్‌ ఉన్న సినిమాను తీసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రతి ఒక్కరికీ తప్పకుండా నచ్చుతుంది’ అని చెప్పారు. ‘గుణశేఖర్‌తో వర్క్‌ చేయటం గౌరవంగా భావిస్తున్నాను. ఈ సినిమా తప్పకుండా అందరూ మెచ్చే సినిమా అవుతుంది’ అని హీరోయిన్‌ సారా అర్జున్‌ అన్నారు. సీనియర్‌ నటి భూమిక మాట్లాడుతూ,’ఈ సినిమా నాకు చాలా స్పెషల్‌ జర్నీ. 23 ఏళ్ళ తరువాత గుణశేఖర్‌తో కలిసి పని చేయటం సంతోషంగా ఉంది. ఇది నా కెరీర్‌లోనే స్పెషల్‌ సినిమా అవుతుంది. ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకు నా కొడుకు గుర్తొచ్చాడు. పిల్లలను ఎలా పెంచాలి అనేది అందరూ తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది’ అని తెలిపారు.

మీ అందరూ ఈ సినిమా ఎమోషన్‌కి కనెక్ట్‌ అవుతారు. ఈ కథలో అడాలసెన్స్‌ అనేది చాలా కీలకం. అందుకే చాలా మంది కొత్త టీనేజర్స్‌ని తీసుకున్నాం. అలాగే ‘పొన్నియల్‌ సెల్వన్‌’లో చేసిన సారా అర్జున్‌ని తీసుకున్నాం. ఈ కథ చెప్పగానే సారా తండ్రి రాజ్‌ అర్జున్‌ షాక్‌ అయ్యారు. ఇంత మంచి కథని కచ్చితంగా జనాలకు చెప్పాలి అని అన్నారు. కాలభైరవ అద్భుతమైన సంగీతం అందించారు. ఈ ఏడాది చాలా నవ్వులతో స్టార్ట్‌ అయ్యింది. అందుకే వచ్చేనెల 6న ఒక స్పెషల్‌ మూమెంట్‌ కోసం ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నాం. -దర్శకుడు గుణశేఖర్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -