Sunday, January 18, 2026
E-PAPER
Homeకవితఆ పుస్తకాల పరిమళం

ఆ పుస్తకాల పరిమళం

- Advertisement -

సుతిమెత్తని సున్నితత్వంతో
నా అరిచేతుల్ని అలాగే తడుముతూనే ఉంది
పేజీలు మూసుకున్నా సందర్శకుల కంఠస్వరాలు
మాటల రూపంలో ఇంకా నా అనుభూతుల్ని
మెలిపెట్టి తిప్పుతూనే ఉన్నాయి
చదువరి చూపులో మెరిసిన ఓ చిన్న ఆశ
రచయిత ముఖంలో వెలిగిన సంతోషమై
పులకించిన ఉత్సాహ క్షణాలు
కొనుగోలు చేసినవి కొన్ని పుస్తకాలే అయినా,
ఇంటికి మోసుకొచ్చినవి మాత్రం
ఎన్నో హృదయస్పర్శల తీపి గుర్తులు
స్టాల్‌ అమ్మకం ముగిసినా
దొర్లిన మధురస్మృతులు మాత్రం
మడిచిన పుస్తకపు పేజీలలా మనసు పొరల్లో
రెపరెపలాడుతూనే ఉన్నాయి
నిజం చెప్పాలంటే ఈ బుక్‌ ఫెయిర్‌
ఓ పుస్తకాల పండగే కాదు, ఆత్మీయతల వసంతోత్సవం
అనిర్వచనీయమైన స్నేహసంతకం
అలసట మాటకేమో కానీ తనివితీరని ఈ తృప్తి ముఖం
మరో ఏడాదికి సరిపడే
ఎదురుచూపుల పరిమళాల్ని మిగిల్చింది!

ఎన్‌. లహరి, 9885535506

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -