Sunday, January 18, 2026
E-PAPER
Homeజాతీయంరాయలసీమ అభివృద్ధికి కృషి చేయాలి

రాయలసీమ అభివృద్ధికి కృషి చేయాలి

- Advertisement -

సాహితీ స్రవంతి రాష్ట్ర గౌరవాధ్యక్షులు తెలకపల్లి రవి

కర్నూలు : రాయలసీమ ప్రాంత అభివృద్ధికి పాలకులు కృషి చేయాలని ప్రముఖ రచయిత, సాహితీ స్రవంతి రాష్ట్ర గౌరవాధ్యక్షులు తెలకపల్లి రవి అన్నారు. సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్‌, రాష్ట్ర కార్యదర్శి జంధ్యాల రఘుబాబుతో కలిసి ఆయన కర్నూలు సి.క్యాంప్‌లోని లలితకళా సమితిలో మీడియాతో చిట్‌చాట్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ… రాయలసీమ ప్రాంతం తరతరాలుగా పాలకుల తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోందన్నారు. రాయలసీమలో నాటి ఆదిమానవుల సంచార చారిత్రక ఆనవాళ్లు బయటపడ్డాయని, ఆదిమానవుల పాదముద్రల రూట్‌మ్యాప్‌ పేరుతో రాయలసీమలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా కేతవరం ఆదిమానవుల గుహలు, జ్వాలాపురాల్లో అవకాశం ఉందని వివరించారు. సాహిత్య రచనలకు ప్రభుత్వాల నుంచి తగిన ప్రోత్సాహం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

సాంస్కృతిక రంగంపై కేంద్రం ఉక్కు పాదం మోపుతోందని, ఇటీవల కాలంలో సాహిత్య పుస్తకాల రవాణాకు ఉపయోగపడే బుక్‌పోస్ట్‌ సర్వీసులను, సాహితీ అవార్డులను సైతం నిలిపివేయడం కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక సాహిత్య వ్యతిరేక విధానాలకు అద్దం పడుతోందని విమర్శించారు. కొత్త పుస్తకాల ముద్రణ కంటే పోస్టల్‌ ఛార్జీలే అధికమయ్యాయని వివరించారు. నాలెడ్జ్‌ సెంటర్‌ అంటే నాలెడ్జ్‌ లెస్‌ సెంటర్లుగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని విమర్శించారు. మంత్రి పవన్‌ కల్యాణ్‌కు జపాన్‌లో ఇచ్చిన అవార్డు జపాన్‌కు సనాతనమవుతుంది తప్ప భారతదేశానికి కాదన్నారు. సనాతనం పేరుతో దేశ సమైక్యతను రాజకీయాలు దెబ్బతీస్తున్నాయని వివరించారు. కెంగారమోహన్‌ మాట్లాడుతూ… నంద్యాల జిల్లా బనగానపల్లిలోని జ్వాలాపురంలో ఆదిమానవుని అవశేషాలు, వాడిన పనిముట్లు బళ్లారిలోని సంగనకల్‌ మ్యూజియంలో భద్రపరచడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. జిల్లా పురావస్తు శాఖ మ్యూజియాన్ని అభివృద్ధి చేయాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -