- Advertisement -
ముంబయి : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 డిసెంబర్‌తో ముగిసిన తృతీయ త్రైమాసికం (క్యూ3)లో ఎల్‌అండ్‌టి ఫైనాన్స్ నికర లాభాలు 17.9శాతం పెరిగి రూ.738.6 కోట్లకు చేరాయి. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.626.4 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.2,237 కోట్లుగా ఉన్న నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ).. గడిచిన క్యూ3లో 13.4 శాతం పెరిగి రూ.2,537 కోట్లుగా చోటుచేసుకుంది. 2025 డిసెంబర్ 31 నాటికి కంపెనీ రిటైల్ రుణ పుస్తకం 21 శాతం వృద్ధితో రూ.1.11 లక్షల కోట్లకు చేరింది.
- Advertisement -



