తొలిసారి 13మంది మహిళాసభ్యులతో కమిటీ
బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారం
చైర్‌పర్సన్‌గా ఇరుప సుకన్య
నవతెలంగాణ-మంగపేట/తాడ్వాయి
మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర నిర్వహణ కోసం ట్రస్ట్ బోర్డు కమిటీని నియమించారు. ఉత్సవ కమిటీ చైర్‌పర్సన్‌తోపాటు 13మంది మహిళా సభ్యులు, ఒక ఎక్స్‌ఆఫిషియో మెంబర్ శనివారం ములుగు జిల్లా మేడారంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈనెల 28నుంచి 31వరకు జరిగే మేడారం జాతరకు సమ్మక్క-సారలమ్మ జాతర ఉత్సవ కమిటీని నియమిస్తూ ఈ నెల 13న దేవాదాయ ధర్మాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో శనివారం హరిత హోటల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో మేడారం జాతర కార్యనిర్వహణ అధికారి వీరస్వామి ఉత్సవ కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఇందులో చైర్‌పర్సన్‌గా ఇరుప సుకన్య సునీల్‌దొర, కమిటీ సభ్యులుగా గీకురు భాగ్యలక్ష్మి, మైపతి రచన, సూదిరెడ్డి జయమ్మ, పాయం రమణ, చింత చంద్రకళ, పులుసం పుష్పలత, గుంటోజు పావని, పొడెం రాణి, జనగాం గంగాలక్ష్మి, భూక్య వసంత, జజ్జరి మమత, గంటమూరి భాగ్యలక్ష్మి, వద్దిరాజు విజయలక్ష్మి, ఎక్స్ ఆఫిషియో సభ్యులుగా సిద్ధబోయిన జగ్గారావు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, జాతర దేవాదాయ శాఖ ఆధీనంలోకి వెళ్లినప్పటి నుంచి నేటి వరకు జాతర ట్రస్టు బోర్డులో సభ్యులుగా మహిళలకు అవకాశం ఇవ్వలేదు. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధికి కృషి చేస్తూ అన్ని రంగాల్లో వారు ముందుండాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
మేడారం జాతర ట్రస్ట్ బోర్డు కమిటీ ఏర్పాటు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



