సీఎస్ కె.రామకృష్ణారావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అవసరమైన సహకారం అందిస్తానని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన టీఎన్జీవో సంఘం 2026 డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు, ప్రభుత్వం ఒకటేననీ, సమస్యలున్నంత కాలం సంఘాలుంటాయని తెలిపారు. ప్రతి ఉద్యోగి హక్కుల కోసం పోరాడే స్వభావం టీఎన్జీవో సంఘానికి ఉందని అభినందించారు.
బాధ్యత తీసుకోండి
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి బాధ్యత తీసుకోవాలని టీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎస్.ఏం హుస్సనీ ముజీభ్‌లు సీఎస్‌ను కోరారు. పీఆర్సి, పెండింగ్ డీఏల విడుదల, పెండింగ్ బిల్లుల మంజూరు, పాత పెన్షన్ విధానం అమలు, హెల్త్ కార్డుల మంజూరు తదితర డిమాండ్లను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. వీటిని సాధించుకునేందుకు పోరాటాలకు పిలుపునివ్వాలని ఉద్యోగుల నుంచి తమపై ఒత్తిడి వస్తున్నదని చెప్పారు.
సమస్యల పరిష్కారానికి ఉద్యోగులకు సహకరిస్తా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



