- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పోరండ్ల దగ్గర అతివేగంగా వచ్చిన కారు రోడ్డుపక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో యువకుడికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ యువకుడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతులను నవనీత్, సాయితేజలుగా పోలీసులు గుర్తించారు.
- Advertisement -



