- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: భారత్, న్యూజిలాండ్ మధ్య సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే చివరి వన్డే ఆదివారం నాడు హోల్కర్ స్టేడియంలో జరగనుంది. తొలి వన్డేలో భారత్ గెలవగా, రెండో వన్డేలో న్యూజిలాండ్ విజయం సాధించింది. సొంతగడ్డపై భారత్ పటిష్టంగా ఉన్నప్పటికీ, అనుభవం తక్కువగా ఉన్న కివీస్ కూడా ఆకట్టుకుంది. దీంతో చివరి మ్యాచ్ ఆసక్తికరంగా మారనుంది.
- Advertisement -



