- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ లో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు ఊరెళ్లడంతో తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ చోరీ చేస్తున్నారు. గత రెండు మూడు రోజులుగా నగరంలో తరచూ దొంగతనాలు జరగడం ఆందోళన కలిగిస్తుంది. శనివారం హైదరాబాద్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. కేవలం 24గంటల వ్యవధిలోనే నాలుగు ఇళ్లలో చోరీలు జరిగాయి. అందులో ఓ కానిస్టేబుల్ ఇల్లు కూడా ఉండటం షాకింగ్ గా మారింది. ఇళ్లలోకి దూరిన దుండగులు బంగారం, వెండి, నగదుతో పాటు ఖరీదైన వస్తువులను ఎత్తుకెళ్లినట్టు బాధితులు చెబుతున్నారు.
- Advertisement -



