నవతెలంగాణ-హైదరాబాద్: పల్లెజీవన విధానంలో ఆదివారం సాధారణమైన రోజే. కానీ మెట్రోపాలిటన్ సిటీ హైదరాబాద్ నగరంలో సండే ఫన్‌డేగా ఉంటుంది. వీకెండ్ పార్టీలతో నగరవాసులు చీల్ అవుతుంటారు. పని ఒత్తిడితో అలిసిన బాడీకి మరికొందరు వన్ డే టూర్లకు ప్లాన్ చేస్తుంటారు. రోజువారి వంటకాలతో రుచిమరిచిన జిహ్వాకు.. వినూత్న వంటకాల రుచులను ఆస్వాదించడానికి.. భోజన ప్రియులు పలు హోటల్స్ కోసం కాళ్లకు చక్రాలు వేసుకొని షికారు చేస్తుంటారు. అందుకు భాగ్యనగరంలో పేరుపొందిన రెస్టారెంట్లు, హోటల్స్ భారీగానే ఉన్నాయి.
అదే విధంగా ఇతర రాష్ట్రాలకు చెందిన హోటల్స్ కూడా తమ ప్రత్యేక వంటకాలతో సందర్శకులను ఆకర్షిస్తుంటాయి. అదే కోవకు చెందిన కేరళ స్టేట్‌కు చెందిన ఓ మిని రెస్టారెంట్ హైదరాబాద్ నగరవాసులను ఆకట్టుకుంటుంది. కేరళకు చెందిన ప్రత్యేక వంటకాలతో భోజన ప్రియులను ఆకర్షిస్తోంది. సండే వచ్చిందంటే చాలు సందర్శకులతో కిటకిటలాడుతుంది. కేరళ తట్టుకడ(kerala Thattukada) అనే మినిరెస్టారెంట్ నగరంలోని సీతాఫల్ మండి ఇప్లూ సెంట్రల్ యూనివర్సీటీకి అతి చేరువగా ఉంది. కేరళవాసులు ఎంతో ఇష్టంగా తినే పలు వంటకాలు నోరూరిస్తున్నాయి.

పరిప్పు వడ అనేది కేరళ ప్రసిద్ధ వంటకం. ఇది శనగపప్పు (విరిగిన బెంగాల్ పప్పు), పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు ఉప్పు మిశ్రమంతో తయారు చేయబడిన డీప్-ఫ్రై చేస్తారు. ముతకగా రుబ్బిన పప్పు మిశ్రమాన్ని చిన్న గుండ్రని బంతులుగా చేసి, బంగారు గోధుమ రంగు వచ్చేవరకు డీప్-ఫ్రై చేస్తారు.
పజమ్ పోరి (అరటి వడలు), కోజుకట్ట(Kozhukatta) కేరళ, తమిళనాడులలో ప్రసిద్ధి చెందింది, దీనిని బియ్యం పిండితో తయారు చేసి కొబ్బరి, బెల్లం కలిపిన తీపి మిశ్రమంతో నింపుతారు. ఇది తరచుగా టీ లేదా కాఫీతో ఆనందించే ప్రసిద్ధ వంటకం. వీటితోపాటు వివిధ రకాల నోరూరించే వంటకాలు అందుబాటులో ఉన్నాయి. కేరళ శైలిలో చికెన్,మటన్, చేపల, రోయ్యల బిర్యానీలు కూడా ఉన్నాయి. మరీ ఇంకెందుకు ఆలస్యం ఆదివారం వినూత్నమైన కేరళ ప్రసిద్ధ వంటకాలను ఆస్వాదించడానికి కుటంబసమేతంగా కేరళ తట్టుకాడ(kerala Thattukada) రెస్టారెంట్‌ను సందర్శించండి.





